అనపర్తి, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో “జెన్ జీ యూత్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్” విద్యా పర్యటన గోడపత్రికను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువతలో నీటి నిర్వహణపై అవగాహన పెంపొందించేందుకు ధవళేశ్వరం బ్యారేజీ, సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం సందర్శన ఎంతో ఉపయోగకరమని తెలిపారు. “జెన్ జీ యూత్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్” ద్వారా కల్పిస్తున్న ఈ విద్యా పర్యటన అవకాశాన్ని నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


