Monday, 28 September 2026
  • Home  
  • జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
- విజయనగరం 

జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

విజయనగరం, సెప్టెంబర్ 28: యువతలోని ప్రతిభను వెలికితీసి, సాంస్కృతిక, సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విజయనగరంలోని మహారాజా అటానమస్ కళాశాలలో సెట్విజ్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జానపద నృత్యం, జానపద గీతం, నుక్కడ్ నాటక్/వీధి నాటకం, కవితా రచన, పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి 2027 జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఉత్సాహంగా పాల్గొని యువజనోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

విజయనగరం, సెప్టెంబర్ 28: యువతలోని ప్రతిభను వెలికితీసి, సాంస్కృతిక, సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విజయనగరంలోని మహారాజా అటానమస్ కళాశాలలో సెట్విజ్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జానపద నృత్యం, జానపద గీతం, నుక్కడ్ నాటక్/వీధి నాటకం, కవితా రచన, పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి 2027 జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఉత్సాహంగా పాల్గొని యువజనోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.