Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

నవోదయ గ్రాండ్ టెస్ట్ కు విశేష స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవోదయ గ్రాండ్ టెస్ట్ కు విశేష స్పందన

వార్త ముఖ్యాంశాలు

  • నవోదయ గ్రాండ్ టెస్ట్‌కు విశేష స్పందన 150 మంది విద్యార్థుల హాజరు – టాప్ 10 విజేతలకు ఘన సత్కారం విజయనగరం జిల్లా బ్యూరో రమణ నవంబర్ 15 పున్నమి ప్రతినిధి కొత్తవలస సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్, కొత్తవలస వారి ఆధ్వర్యంలో…
  • ఈ పరీక్షకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.
  • పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు.

నవోదయ గ్రాండ్ టెస్ట్‌కు విశేష స్పందన

150 మంది విద్యార్థుల హాజరు – టాప్ 10 విజేతలకు ఘన సత్కారం
విజయనగరం జిల్లా బ్యూరో రమణ నవంబర్ 15 పున్నమి ప్రతినిధి

కొత్తవలస సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్, కొత్తవలస వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నవోదయ గ్రాండ్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.

పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు. అనంతరం పరీక్షలో టాప్ 10 స్థానాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు మరియు షీల్డులను అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు బగాది రమణ, పైడి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించి, నవోదయ ప్రవేశ పరీక్షకు మరింత మెరుగైన సన్నద్ధత కల్పించడమే ఈ గ్రాండ్ టెస్ట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *