వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ రిపోర్టర్ ).పామూరు మండల టీడీపీ పార్టీ అధిష్టానం బలపరిచిన జిల్లా పరిషత్ అభ్యర్థిగా విద్యావంతురాలైన బైరెడ్డి జాహ్నవిరెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని మండల మూడో ప్రాదేశిక ఎంపీటీసీగా గెలుపొందిన ఆర్.
- ఆర్.
- రఫీ పిలుపు నిచ్చారు.
పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ రిపోర్టర్ ).పామూరు మండల టీడీపీ పార్టీ అధిష్టానం బలపరిచిన జిల్లా పరిషత్ అభ్యర్థిగా విద్యావంతురాలైన బైరెడ్డి జాహ్నవిరెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని మండల మూడో ప్రాదేశిక ఎంపీటీసీగా గెలుపొందిన ఆర్. ఆర్. రఫీ పిలుపు నిచ్చారు. పామూరు లోని శేషమహల్ సినిమాహాల్ ప్రాంగణంలో నిన్న జరిగిన ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశం లో ఆర్. ఆర్. రఫీ మాట్లాడుతూ, జడ్పీటీసీ అభ్యర్థి జాహ్నవిరెడ్డి గెలుపుకోసం అందరూ సమిష్టిగా కృషిచేయాలని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.ఉన్నత విద్యావంతురాలైన జాహ్నవి గెలవడంవలన పామూరుతో పాటు మండల పరిధిలో వున్న 18ఎంపీటీసీల చిన్న, చిన్న గ్రామాలు అభివృద్ధికి నోచుకునే అవకాశం మరింత ఎక్కువ. పామూరు పట్టణ స్థానికురాలైన జాహ్నవి, ఎల్లప్పుడూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవచేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆర్. ఆర్. రఫీ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయ కర్త యలమందల రహీముల్లాహ్ మాట్లాడుతూ, మండలస్థాయిలోని అన్నివర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యం కలగాలంటే జాహ్నవిరెడ్డి గెలుపు ఎంతో అవసరం అన్నారు.రేపు జరిగే జిల్లాపరిషత్ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని జాహ్నవిరెడ్డి గెలుపుకు కృషి చేయాలని రహీముల్లాహ్ అన్నారు.జాహ్నవిరెడ్డి ప్రచార కార్యక్రమంలో టీడీపీ పార్టీ అమలు చేసిన ప్రభుత్వ పధకాలు మండల ప్రజలకు తెలిసే విధంగా కరపత్రాలు ముద్రించి, ఇంటింటికి పంచాలని రహీముల్లాహ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ టీడీపీ నాయకులు,కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాశులు విశేషంగా పాల్గొని జయప్రదం చేశారు.