కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.పెద్దాపురం, సామర్లకోట పట్టణాలకు చెందిన సుమారు 1,000 మందికి పైగా వైసీపీ నాయకులు, వివిధ హోదాల్లోని కార్యకర్తలు, మహిళలు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు.ఈ భారీ చేరికల కార్యక్రమం స్థానిక రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించడంతో పాటు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలానికి దారితీసింది.కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది.పెద్దాపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్,జనసేన ప్రముఖ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్ అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున జనసేన కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్,కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ,రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, తుని నియోజకవర్గ ఇంచార్జ్ యనమల కృష్ణుడు తదితరులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సాదరంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
*మార్పుకు నిదర్శనమే ఈ చేరికలు: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్*
ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వస్తున్న రాజకీయ మార్పునకు ఈ భారీ చేరికలే ప్రత్యక్ష సాక్ష్యమని స్పష్టం చేశారు. పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల్లో ప్రజలు జనసేన విధానాల వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ జోష్ మరింత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
*ప్రజలే అసలైన తీర్పునిస్తున్నారు: ఎమ్మెల్యే పంతం నానాజీ*
ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ.. కేవలం విమర్శలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలు మరియు కార్యకర్తలు తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలే వైసీపీ విధానాలకు సమాధానం చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ వీడుతున్న వారిని అడ్డుకోలేక వైసీపీ నాయకత్వం చతికిలబడిందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) విమర్శించారు.
*ఆత్మపరిశీలన చేసుకోవాలి:*
గత రాజకీయ ప్రసంగాలు పక్కన పెట్టి, ప్రస్తుతం కార్యకర్తలు ఎటువైపు నిలబడుతున్నారో వైసీపీ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని జనసేన నేతలు హితవు పలికారు.ఈ భారీ చేరికలతో పెద్దాపురం పట్టణంలో జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఇస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నాయకులు పునరుద్ఘాటించారు.

*జనసేనలోకి వలసలు!* *- సామర్లకోట, పెద్దాపురంలో ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో పార్టీలోకి చేరికలు*
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.పెద్దాపురం, సామర్లకోట పట్టణాలకు చెందిన సుమారు 1,000 మందికి పైగా వైసీపీ నాయకులు, వివిధ హోదాల్లోని కార్యకర్తలు, మహిళలు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు.ఈ భారీ చేరికల కార్యక్రమం స్థానిక రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించడంతో పాటు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలానికి దారితీసింది.కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది.పెద్దాపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్,జనసేన ప్రముఖ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్ అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున జనసేన కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్,కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ,రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, తుని నియోజకవర్గ ఇంచార్జ్ యనమల కృష్ణుడు తదితరులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సాదరంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. *మార్పుకు నిదర్శనమే ఈ చేరికలు: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్* ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వస్తున్న రాజకీయ మార్పునకు ఈ భారీ చేరికలే ప్రత్యక్ష సాక్ష్యమని స్పష్టం చేశారు. పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల్లో ప్రజలు జనసేన విధానాల వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ జోష్ మరింత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. *ప్రజలే అసలైన తీర్పునిస్తున్నారు: ఎమ్మెల్యే పంతం నానాజీ* ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ.. కేవలం విమర్శలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలు మరియు కార్యకర్తలు తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలే వైసీపీ విధానాలకు సమాధానం చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ వీడుతున్న వారిని అడ్డుకోలేక వైసీపీ నాయకత్వం చతికిలబడిందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) విమర్శించారు. *ఆత్మపరిశీలన చేసుకోవాలి:* గత రాజకీయ ప్రసంగాలు పక్కన పెట్టి, ప్రస్తుతం కార్యకర్తలు ఎటువైపు నిలబడుతున్నారో వైసీపీ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని జనసేన నేతలు హితవు పలికారు.ఈ భారీ చేరికలతో పెద్దాపురం పట్టణంలో జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఇస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నాయకులు పునరుద్ఘాటించారు.

