కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమర శంఖం పూరించింది. మండలంలో సాగుతున్న ప్రచార పాదయాత్ర సందర్భంగా తెల్కపల్లి నెహ్రూ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర నాయకుడు ఎం.బాల నరసింహ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమైందని, అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికులు, రైతుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవులు గౌడ్, రవీందర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

జన వ్యతిరేక పాలనపై సీపీఐ సమర శంఖం