జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు ఎలాంటి వివాదాలకు తావులేకుండా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి మన్ననలు పొందిన శ్రీమతి ఆనం అరుణమ్మ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె నివాసంలో నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాశం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనం అరుణమ్మను శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులోనూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆమె పదవీకాలంలో చేసిన సేవలను వారు ప్రశంసించారు.

జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు అభినందనలు పదవీకాలం పూర్తైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్సీపీ నేతలు