కలిగిరి: వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు. కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని వారు కోరారు. గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమంలో ఒక్కొక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



