శ్రీ కాళహస్తి, జూన్ 26, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామస్వామి చిత్రపట ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుక్రవారం పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు మరియు భక్తులు ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో ఈ మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

జగ్గరాజుపల్లిలో సీతారాముల మహాకుంభాభిషేకంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి