Sunday, 19 July 2026
  • Home  
  • జగనన్న 2.0 సూపర్‌ యాప్‌తో పార్టీకి డిజిటల్‌ బలం*
- తిరుపతి

జగనన్న 2.0 సూపర్‌ యాప్‌తో పార్టీకి డిజిటల్‌ బలం*

క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పున్నమి ప్రతినిధి , చంద్రగిరి మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సూచనలతో శనివారం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ‘జగనన్న 2.0 సూపర్‌ యాప్‌’ క్యూఆర్‌ కోడ్‌ను రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని వివరాలను ఒకే వేదికపై కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావడమే ‘జగనన్న 2.0 సూపర్‌ యాప్‌ లక్ష్యమని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత సమాచారం, తాజా అప్‌డేట్లు, కార్యకర్తలకు ఉపయోగపడే అంశాలన్నీ ఈ యాప్‌లో సమగ్రంగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. పార్టీ కార్యకర్తలు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. డిజిటల్‌ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు ఓబుల్‌రెడ్డి, పాకాల చరణ్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి శశిధర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు భానుకుమార్‌రెడ్డి, పృథ్వీరెడ్డి, తిరుపతి రూరల్‌ మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు గూడూరు రఫీ, రామచంద్రపురం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు యశ్వంత్‌రెడ్డి, చంద్రగిరి మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎర్రావారిపాలెం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు శేషరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్టీ సెల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వెంకట్‌నాయక్‌, హరికృష్ణ, ధనుష్‌ తదితరులు పాల్గొన్నారు.

క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి

పున్నమి ప్రతినిధి , చంద్రగిరి మండలం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సూచనలతో శనివారం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ‘జగనన్న 2.0 సూపర్‌ యాప్‌’ క్యూఆర్‌ కోడ్‌ను రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని వివరాలను ఒకే వేదికపై కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావడమే ‘జగనన్న 2.0 సూపర్‌ యాప్‌ లక్ష్యమని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత సమాచారం, తాజా అప్‌డేట్లు, కార్యకర్తలకు ఉపయోగపడే అంశాలన్నీ ఈ యాప్‌లో సమగ్రంగా అందుబాటులో ఉంటాయని చెప్పారు.

పార్టీ కార్యకర్తలు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. డిజిటల్‌ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు ఓబుల్‌రెడ్డి, పాకాల చరణ్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి శశిధర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు భానుకుమార్‌రెడ్డి, పృథ్వీరెడ్డి, తిరుపతి రూరల్‌ మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు గూడూరు రఫీ, రామచంద్రపురం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు యశ్వంత్‌రెడ్డి, చంద్రగిరి మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎర్రావారిపాలెం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు శేషరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్టీ సెల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వెంకట్‌నాయక్‌, హరికృష్ణ, ధనుష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.