Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చినుకుకే జలమయ బ్రిడ్జి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు హైవే నుంచి పొదలకూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై స్వల్ప వర్షానికే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • బ్రిడ్జి ఇరువైపులా మట్టి పేరుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లక గంటలపాటు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది.
  • ద్విచక్ర వాహనదారులపై భారీ వాహనాలు వెళ్లే సమయంలో నీరు చిమ్మి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు హైవే నుంచి పొదలకూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై స్వల్ప వర్షానికే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి ఇరువైపులా మట్టి పేరుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లక గంటలపాటు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులపై భారీ వాహనాలు వెళ్లే సమయంలో నీరు చిమ్మి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వెంటనే ఆర్‌అండ్‌బి అధికారులు బ్రిడ్జిని తనిఖీ చేసి, ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *