Sunday, 28 June 2026
  • Home  
  • చంద్రగిరి నాని పై బిజెపి నేత మేడసాని ధ్వజం
- తిరుపతి

చంద్రగిరి నాని పై బిజెపి నేత మేడసాని ధ్వజం

“మరో గుడివాడ నాని తరహాలో అవినీతి… కూటమి ముద్దు, తెలుగు దేశం ఇంకా ముద్దు అత్యంత అవినీతి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దు అంటూ బిజెపి ఇన్చార్జి మేడసాని పురుషోత్తం నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం సంచలనంగా మారింది. చంద్రగిరి ప్రజలారా, అవినీతిపరులైన ఎమ్మెల్యే నుంచి చంద్రగిరిని కాపాడుకుందాం అంటూ ఆయన ఇచ్చిన పిలుపు సర్వత్ర చర్చనీయాంశమైంది. పులివర్తి నాని కాదు వెంకట Money ప్రసాద్ అని నామకరణం చేస్తూ చంద్రగిరి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ పురుషోత్తం నాయుడు చేసిన ప్రకటన చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ కలకలం సృష్టించింది. జాతీయ రహదారి కాంట్రాక్ట్ దక్కించుకున్న తనను ఎమ్మెల్యే నాని తీవ్ర ఇబ్బందుకు పెడుతున్నారని. ప్రతి నెలా తన దగ్గర కప్పం కట్టించుకొని కూడా రోడ్డు పనులు ఆపుతున్నాడని ఆరోపించారు తమ కుటుంబానికి చాలా ఏళ్లుగా టిడిపి పార్టీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నా. తాను మాత్రం తొలి నుంచి బీజేపీలో ఉన్నట్లు తెలిపారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ తనకు రాగా 2025, ఫిబ్రవరి లో పని ప్రారంభించగా కొందరు చంద్రగిరి టీడీపీ నాయకులు మొదటే అడ్డుకున్నారని,రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన గ్రావెల్ సేకరణ అనుమతులు కోసం చాలా ఇబ్బందులు పడగా… దీంతో వెంటనే పనులు ఆపేసినట్లు తెలిపారు .కలెక్టర్ దగ్గర నుంచి చాలా మంది అధికారులను కలిసి గ్రావెల్ అనుమతులు కోసం తిరిగిన క్రమంలో చివరకు చంద్రగిరి ఎమ్మెల్యే నాని తనకు కాల్ చేసి, కొందరు టిడిపి నాయకులను కలవమని చెప్పడంతో మండల టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డిని కలిస్తే నెలకు 10 లక్షలు అడిగాడని, బేరం ఆడితే చివరకు నెలకు నాలుగు లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని కి సుమారుగా 29 లక్షలు ఇచ్చానని,కూటమిలో ఉన్న నన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తున్న

“మరో గుడివాడ నాని తరహాలో అవినీతి…
కూటమి ముద్దు, తెలుగు దేశం ఇంకా ముద్దు అత్యంత అవినీతి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దు అంటూ బిజెపి ఇన్చార్జి మేడసాని పురుషోత్తం నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం సంచలనంగా మారింది.
చంద్రగిరి ప్రజలారా, అవినీతిపరులైన ఎమ్మెల్యే నుంచి చంద్రగిరిని కాపాడుకుందాం అంటూ ఆయన ఇచ్చిన పిలుపు సర్వత్ర చర్చనీయాంశమైంది.
పులివర్తి నాని కాదు వెంకట Money ప్రసాద్ అని నామకరణం చేస్తూ చంద్రగిరి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ పురుషోత్తం నాయుడు చేసిన ప్రకటన
చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ కలకలం సృష్టించింది.
జాతీయ రహదారి కాంట్రాక్ట్ దక్కించుకున్న తనను ఎమ్మెల్యే నాని తీవ్ర ఇబ్బందుకు పెడుతున్నారని. ప్రతి నెలా తన దగ్గర కప్పం కట్టించుకొని కూడా రోడ్డు పనులు ఆపుతున్నాడని ఆరోపించారు తమ కుటుంబానికి చాలా ఏళ్లుగా టిడిపి పార్టీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నా. తాను మాత్రం తొలి నుంచి బీజేపీలో ఉన్నట్లు తెలిపారు.
తిరుపతి రూరల్ పరిధిలో ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ తనకు రాగా
2025, ఫిబ్రవరి లో పని ప్రారంభించగా కొందరు చంద్రగిరి టీడీపీ నాయకులు మొదటే అడ్డుకున్నారని,రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన గ్రావెల్ సేకరణ అనుమతులు కోసం చాలా ఇబ్బందులు పడగా… దీంతో వెంటనే పనులు ఆపేసినట్లు తెలిపారు .కలెక్టర్ దగ్గర నుంచి చాలా మంది అధికారులను కలిసి గ్రావెల్ అనుమతులు కోసం తిరిగిన క్రమంలో
చివరకు చంద్రగిరి ఎమ్మెల్యే నాని తనకు కాల్ చేసి, కొందరు టిడిపి నాయకులను కలవమని చెప్పడంతో
మండల టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డిని కలిస్తే నెలకు 10 లక్షలు అడిగాడని, బేరం ఆడితే చివరకు నెలకు నాలుగు లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని
ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని కి సుమారుగా 29 లక్షలు ఇచ్చానని,కూటమిలో ఉన్న నన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తున్న

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.