Wednesday, 9 September 2026
  • Home  
  • చందనాపూర్ లో లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..
- పెద్దపల్లి

చందనాపూర్ లో లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ రామగిరి, సెప్టెంబర్ 08: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ, రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. సర్పంచ్ కొండా మంజుల శ్రీనివాస్ క్లబ్ చైర్మన్ మొల్మురి శ్రీనివాస్ ను సంప్రదించి గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ తెలుపగా వారు రేకుర్తి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ చిదుర సురేష్‌తో చర్చించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డా. శరణ్య యాదవ్, టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 28 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామ పాలకవర్గం, గ్రామస్థులు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్‌తో పాటు క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. శరణ్య యాదవ్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 650 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి, అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను ఉచితంగా అందించామని తెలిపారు. భవిష్యత్తులో మండలంలోని అన్ని గ్రామాల్లో ఇటువంటి కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు క్లబ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కంటి ఆపరేషన్ల ద్వారా దృష్టి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా, కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా తగ్గుతుందని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు. తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం లేదా కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించాలనుకునే వారు లయన్స్ క్లబ్ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. అలాగే ఇట్టి అవకాశం కల్పించిన రేకుర్తి ఆసుపత్రి చైర్మన్ ప్రకాష్ హొల్ల, వైస్ చైర్మన్ చిదుర సురేష్ కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మేకల మారుతి యాదవ్, మోలుమూరి శ్రీనివాస్, ఐ విజన్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎలువక ఓదెలు, పరంకుశం శ్రీనివాస్ చారి, గ్రామ కార్యదర్శి సునీల్, ఉప సర్పంచ్ రజిత రాంచందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్

రామగిరి, సెప్టెంబర్ 08: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ, రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. సర్పంచ్ కొండా మంజుల శ్రీనివాస్ క్లబ్ చైర్మన్ మొల్మురి శ్రీనివాస్ ను సంప్రదించి గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ తెలుపగా వారు రేకుర్తి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ చిదుర సురేష్‌తో చర్చించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డా. శరణ్య యాదవ్, టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 28 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామ పాలకవర్గం, గ్రామస్థులు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్‌తో పాటు క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. శరణ్య యాదవ్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 650 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి, అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను ఉచితంగా అందించామని తెలిపారు. భవిష్యత్తులో మండలంలోని అన్ని గ్రామాల్లో ఇటువంటి కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు క్లబ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కంటి ఆపరేషన్ల ద్వారా దృష్టి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా, కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా తగ్గుతుందని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు. తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం లేదా కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించాలనుకునే వారు లయన్స్ క్లబ్ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. అలాగే ఇట్టి అవకాశం కల్పించిన రేకుర్తి ఆసుపత్రి చైర్మన్ ప్రకాష్ హొల్ల, వైస్ చైర్మన్ చిదుర సురేష్ కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మేకల మారుతి యాదవ్, మోలుమూరి శ్రీనివాస్, ఐ విజన్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎలువక ఓదెలు, పరంకుశం శ్రీనివాస్ చారి, గ్రామ కార్యదర్శి సునీల్, ఉప సర్పంచ్ రజిత రాంచందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.