Sunday, 16 August 2026
  • Home  
  • ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- BHADRADRI

ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

బద్రాద్రి కొత్తగూడెం ,చుంచుపల్లి మండలం, ఆగస్టు,15,(పున్నమి ప్రతినిధి) రామవరం 16వ వార్డులో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు, విద్యార్థులకు తీపి పదార్థాలు పంపిణీ చేశారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

బద్రాద్రి కొత్తగూడెం ,చుంచుపల్లి మండలం, ఆగస్టు,15,(పున్నమి ప్రతినిధి)

రామవరం 16వ వార్డులో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు, విద్యార్థులకు తీపి పదార్థాలు పంపిణీ చేశారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.