Sunday, 3 May 2026
  • Home  
  • ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు జన్మదిన వేడుకలు
- తిరుపతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్‌సీవీ నాయుడు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి తదితర నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌సీవీ నాయుడు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచగా, పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు గజపూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్థానిక అర్చకులు, వివిధ మత పెద్దలు ఆశీర్వాదాలు అందించగా, ప్రజానాట్యమండలి కళాకారిణి ఆయన సేవా గుణాన్ని కొనియాడుతూ జానపద గీతంతో అలరించారు. ఈ సందర్భంగా ఎస్సీవీ యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడగా, ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ, పండ్లరసాల పంపిణీ చేపట్టారు. అభిమానులు, నాయకులతో ఎస్‌సీవీ నాయుడు గృహం జనసందడిగా మారి వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.