శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజికవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని ఆరు ముఖ్య ప్రాంతాలలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను కొట్టే సాయి స్వయంగా ముందంజలో ఉండి నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎం ఎం వాడ సర్కిల్, బహదూర్ పేట సర్కిల్‌లతో పాటు శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లె సర్కిల్, సుబ్బా నాయుడు కండ్రిగ అరుంధతివాడ సర్కిల్, తొట్టంబేడు మండలం పూడి అరుంధతివాడ సర్కిల్, రేణిగుంట మండలం కరకంబాడి సర్కిల్‌లలో ఆయన సమక్షంలో జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో వందలాదిగా తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. కొట్టే సాయి నేతృత్వంలో పలుచోట్ల పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణలు