కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త గ్రామీణ ఉపాధి పథకం “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్” కోసం ₹95,962 కోట్ల మధ్యంతర నిధులను ప్రకటించారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా చేరలేదు. రాష్ట్రాలు అదనంగా సుమారు 40 శాతం వరకు నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పథకం వ్యయం సుమారు ₹1.25 లక్షల కోట్లకు చేరనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పాత పథకాల నుంచి కొత్త పథకానికి మార్పు సాఫీగా జరిగేందుకు ఈ నిధులు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

గ్రామీణ ఉపాధి పథకానికి ₹95,962 కోట్ల కేటాయింపు