ఏక చక్ర పుర అగ్రహారానికి వదిలిన రాక్షస పీడ
పున్నమి ప్రతినిధి రామచంద్రపురం మండలం
రామచంద్రాపురం మండలంలోని నిలువురాళ్ల కమ్మపల్లి 60 వ మహాభారత
వార్షికోత్సవాలలో నాల్గవ రోజు అయిన ఆదివారం గ్రామ గ్రామం నుంచి బకక్కాసురునికి బండి కుంభాలు తరలి వచ్చాయి. భీముని పాత్ర దారి బండిలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి బక్కాసురునికి ఆహారంగా సమర్పించడానికి అన్నం మునగాకు అవిశాకులతో చేసిన తాలింపులు వంకాయి సాంబారు తో కలిపిన వివిధ ఆహారపు పదార్థాలను తీసుకుని ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయం వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా మహాభారత పరిధిలోని కార్యనిర్వాహక గ్రామాల నుంచి ఎద్దుల బండ్లు ,ట్రాక్టర్లలో వేడుకగా బ్యాండ్ మేళాలతో, డప్పుల చెప్పులతో బండి కుంభాలను తీసుకొని ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. మూడు చుట్లు బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. భీముని ఉత్సవ విగ్రహం ముందు బండి కుంభాలను రాసిగా పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి కొంత మిరాసిదారులకు ఇచ్చి మిగిలింది భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. హరికథ భాగవతారని స్వర్ణలత లక్క ఇంటి దహనం నుంచి పాండవులు తప్పించుకోవటం బ్రాహ్మణుల వేషంలో “ఏక చక్ర పురం” అనే అగ్రహారంకు చేరుకుని ఓ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేయటం,ఆ సమయంలో బకాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ అగ్రహారం పైన పడి దొరికిన వారిని దొరికినట్లు సంహరించి తినివేయటం వంటి విషయాలను విని భీముని బండితో సహా బకాసురుడు ఉండే గుహ వద్దకు పంపి బకాసురుని సంహరించటం వంటి ఘట్టాలను రాగయుక్తంగా ఆలాపించారు. రాత్రి శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి వారు భీమ బకాసుర ద్వంద్వ యుద్ధాన్ని ప్రేక్షకులను భీతావహులు చేసే విధంగా చక్కగా ప్రదర్శించారు.
బక్కాసుర వధ కార్యక్రమానికి నిలువు రాళ్ల కమ్మపల్లి గ్రామానికి చెందిన దివంగత మైదాల మునిరత్నం నాయుడు
,గంగ మునెమ్మల కుమారుడు మైదాల మధుసూదన్ నాయుడు,ఇందు కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.మూడు పూటలా ఇదే గ్రామానికి చెందిన దివంగత లెక్కల రామ్మూర్తి నాయుడు భార్య శశికళ కుటుంబ సభ్యులు మమత, మాధుర్య, శ్రీనివాసులు
ఉభయదారులుగా వ్యవహరించారు.
ద్రౌపతి మాతకు సోభాయమాన అలంకారం:
ఆది గర్భేశ్వరి శ్రీ ద్రౌపతి మాతతో పాటు శ్రీ కృష్ణ, ధర్మరాజు,భీమా,అర్జున, నకుల సహదేవుల మూలవిరాట్టులకు, ఉత్సవమూర్తులకు శోభాయమానంగా దివంగత అర్చకులు బ్రహ్మర్షి వెంకటరత్నం ఆచారి ఆశీస్సులతో
ప్రధాన అర్చకులు హరి స్వామి,అర్చకులు అరవింద ఆచారి అలంకరించి పూజలు నిర్వహించారు.మూడు పూటలా ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఘనాచార్యులు,భటా చార్యులు స్వామివారి శిష్య బృందం భక్తులకు చక్కటి ఏర్పాట్లు కల్పించారు.ఆలయ ధర్మకర్తలు రమేష్ బాబు రవికుమార్ లు గ్రామ పెద్దలతో కలిసి ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.భక్తులకు మూడు పూటలా అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.గ్రామ యువత కార్యనిర్వాహక గ్రామాల యువతతో కలిసి బకాసుర బండి కుంభాల కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహించారు. వార్షిక ఉత్సవాలు నిర్వహించే 11 రోజులు మెత్త కుప్పం కొచ్చింది నా శశిధర్ షామీయానా సప్లయర్స్
భక్తులకు అవసరమగు కుర్చీలు టెంట్లు వేశారు. మాజీ ఎంపీపీ దొర ప్లాస్టిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత తానికొండ కేశవ నాయుడు అన్నప్రసాద పంపిణీకి అవసరమయ్యే ప్లేట్లు గ్లాసులను వితరణ చేశారు. వడమాల పేట మండలం సిరిమన్యం గ్రామానికి చెందిన శ్రీనివాసులు ,శ్రీరాములు బృందం అన్నప్రసాదానికి రుచికరమైన వంటలను తయారు చేసారు. భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ఉత్సవాలను తిలకించి, ప్రసాదాలను స్వీకరించి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ధర్మకర్తలు గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు.



