Saturday, 16 May 2026
  • Home  
  • గ్రంథాలయ భవనాల పనులు వేగవంతం చేయాలి- రెడ్డివారి గురవారెడ్డి
- తిరుపతి

గ్రంథాలయ భవనాల పనులు వేగవంతం చేయాలి- రెడ్డివారి గురవారెడ్డి

శ్రీ కాళహస్తి, మే 16 (పున్నమి న్యూస్): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న, మరమ్మత్తులకు గురైన గ్రంథాలయ భవనాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు డీసీఎల్ భవనం నిర్మాణం, తొట్టంబేడు గ్రంథాలయ ఎలక్ట్రికల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వరదయ్యపాలెం గ్రంథాలయ నిర్మాణ పనులను వచ్చే వారం నుంచి పునఃప్రారంభించాలని, తిరుపతి గ్రంథాలయంలో స్టడీ హాల్ నిర్మాణంతో పాటు చంద్రగిరి, ముత్యాలరెడ్డిపల్లి గ్రంథాలయాల మరమ్మత్తులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తి గ్రంథాలయం ను పరిశీలించిన ఆయన కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఇతర మరమ్మత్తులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.