Friday, 25 September 2026
  • Home  
  • గోస్తని నదిపై బ్రిడ్జి నిర్మించండి మహాప్రభో!
- అల్లూరి సీతారామరాజు

గోస్తని నదిపై బ్రిడ్జి నిర్మించండి మహాప్రభో!

అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధిలోని సీతంపేట గ్రామ గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా, గ్రామానికి చేరుకోవాలన్నా గోస్తని నది దాటాల్సి వస్తోందని తెలిపారు. వర్షాకాలంలో గోస్తని నదిలో నీటి ప్రవాహం పెరగడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని వాపోయారు.అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయంలో, నిత్యావసర సరుకుల కోసం కాశీపట్నం సంతకు వెళ్లే సందర్భంలో కూడా నదిని దాటాల్సి వస్తోందన్నారు. నదిపై శాశ్వత బ్రిడ్జి లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో తమ గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి గోస్తని నదిపై వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టి తమ కష్టాలను తీర్చాలని సీతంపేట గ్రామ గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధిలోని సీతంపేట గ్రామ గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా, గ్రామానికి చేరుకోవాలన్నా గోస్తని నది దాటాల్సి వస్తోందని తెలిపారు. వర్షాకాలంలో గోస్తని నదిలో నీటి ప్రవాహం పెరగడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని వాపోయారు.అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయంలో, నిత్యావసర సరుకుల కోసం కాశీపట్నం సంతకు వెళ్లే సందర్భంలో కూడా నదిని దాటాల్సి వస్తోందన్నారు.
నదిపై శాశ్వత బ్రిడ్జి లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో తమ గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై పలుమార్లు ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి గోస్తని నదిపై వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టి తమ కష్టాలను తీర్చాలని సీతంపేట గ్రామ గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.