Sunday, 27 September 2026
  • Home  
  • గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు
- తిరుపతి

గోసేవతో సమాజానికి, ప్రకృతికి మేలు

గో ఆధారిత వ్యవసాయం, ఉత్పత్తులను ప్రతి ఇంటికీ అందించడమే లక్ష్యం – శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తిరుపతి, ఆగస్టు 11 పున్నమి ప్రతినిధి గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి, పర్యావరణానికి మరింత మేలు చేయాలన్న సంకల్పంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. దాతల సహకారంతో ప్రస్తుతం సుమారు 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, వాటికి అవసరమైన ఆహారం, వైద్యం, సంరక్షణ వంటి సేవలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. గోవులను కేవలం సంరక్షించడం మాత్రమే కాకుండా, గోమాత ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేసి, గో ఆధారిత జీవన విధానాన్ని ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు తదితరాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా గో ఆధారిత సహజ ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారాన్ని కాపాడటంతో పాటు, ఆరోగ్యకరమైన పంటలను పండించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే గోవుల నుంచి లభించే సహజ పదార్థాలతో ధూపం, సాంబ్రాణి, విభూతి, గోరుముద్దలు, గో ఆధారిత ఫినాయిల్, గోమయ సమిధలు వంటి వివిధ ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మోహనాచారి తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడం తమ ఉద్దేశమన్నారు. ప్రతి ఇంటిలో గోమాతపై భక్తి, గౌరవం పెంపొందించడంతో పాటు, సామూహికంగా గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసేవ, గోరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తూ, గోవుల సంరక్షణతో పాటు గో ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని మోహనాచారి స్పష్టం చేశారు. గోమాతను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోవుల ద్వారా లభించే సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే రైతులకు, కుటుంబాలకు, సమాజానికి, ప్రకృతికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రజలకు, ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

గో ఆధారిత వ్యవసాయం, ఉత్పత్తులను ప్రతి ఇంటికీ అందించడమే లక్ష్యం

– శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి

తిరుపతి, ఆగస్టు 11 పున్నమి ప్రతినిధి
గోసేవ ద్వారా సమాజానికి, ప్రకృతికి, పర్యావరణానికి మరింత మేలు చేయాలన్న సంకల్పంతో శ్రీ కామధేనువు గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గోసంరక్షణ శాల ట్రెజరర్ మోహనాచారి తెలిపారు.

దాతల సహకారంతో ప్రస్తుతం సుమారు 110కి పైగా గోవులను సంరక్షిస్తూ, వాటికి అవసరమైన ఆహారం, వైద్యం, సంరక్షణ వంటి సేవలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. గోవులను కేవలం సంరక్షించడం మాత్రమే కాకుండా, గోమాత ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేసి, గో ఆధారిత జీవన విధానాన్ని ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టు ఎరువులు తదితరాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా గో ఆధారిత సహజ ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారాన్ని కాపాడటంతో పాటు, ఆరోగ్యకరమైన పంటలను పండించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

అలాగే గోవుల నుంచి లభించే సహజ పదార్థాలతో ధూపం, సాంబ్రాణి, విభూతి, గోరుముద్దలు, గో ఆధారిత ఫినాయిల్, గోమయ సమిధలు వంటి వివిధ ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మోహనాచారి తెలిపారు. గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడం తమ ఉద్దేశమన్నారు.

ప్రతి ఇంటిలో గోమాతపై భక్తి, గౌరవం పెంపొందించడంతో పాటు, సామూహికంగా గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోసేవ, గోరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

గోసంరక్షణ శాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తూ, గోవుల సంరక్షణతో పాటు గో ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని మోహనాచారి స్పష్టం చేశారు.

గోమాతను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోవుల ద్వారా లభించే సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే రైతులకు, కుటుంబాలకు, సమాజానికి, ప్రకృతికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రజలకు, ప్రతి ఇంటికీ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.