Sunday, 27 September 2026
  • Home  
  • గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం అందుకున్న పసుపుల రాజశేఖర్
- అన్నమయ్య

గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం అందుకున్న పసుపుల రాజశేఖర్

చిట్వేలు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ఎన్‌సీసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పసుపుల రాజశేఖర్‌కు ప్రతిష్ఠాత్మకమైన “గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం” లభించింది. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఉషోదయ ఫౌండేషన్, తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవిత, గేయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆదివారం పల్నాడు జిల్లా నరసరావుపేట లెనిన్‌నగర్‌లోని జ్యోతిరావు పూలే కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజశేఖర్‌ను ప్రశంసాపత్రం, శాలువ, మెమెంటో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డా. ధనాసి ఉషారాణి, తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యూవీ రత్నం సంయుక్తంగా ఆధ్వర్యం వహించారు.కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు విజయకుమార్, లీలా మోహన్ కృష్ణ, పల్నాడు జిల్లా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు స్వర్ణ చినరామిరెడ్డి, దైవజ్ఞ రత్న, స్వర్ణ కళాభిజ్ఞ డా. బొక్క శ్రీనివాసరావు, ప్రభుత్వ తెలుగు అధ్యాపకులు పసల గీతా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయులు, సాహిత్యకారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు రాజశేఖర్‌ను అభినందించారు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

చిట్వేలు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ఎన్‌సీసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పసుపుల రాజశేఖర్‌కు ప్రతిష్ఠాత్మకమైన “గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం” లభించింది. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఉషోదయ ఫౌండేషన్, తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవిత, గేయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఆదివారం పల్నాడు జిల్లా నరసరావుపేట లెనిన్‌నగర్‌లోని జ్యోతిరావు పూలే కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజశేఖర్‌ను ప్రశంసాపత్రం, శాలువ, మెమెంటో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డా. ధనాసి ఉషారాణి, తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యూవీ రత్నం సంయుక్తంగా ఆధ్వర్యం వహించారు.కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు విజయకుమార్, లీలా మోహన్ కృష్ణ, పల్నాడు జిల్లా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు స్వర్ణ చినరామిరెడ్డి, దైవజ్ఞ రత్న, స్వర్ణ కళాభిజ్ఞ డా. బొక్క శ్రీనివాసరావు, ప్రభుత్వ తెలుగు అధ్యాపకులు పసల గీతా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయులు, సాహిత్యకారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు రాజశేఖర్‌ను అభినందించారు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.