కొణిజర్ల / ఖమ్మం
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వైరా శాంతినగర్‌కు చెందిన మాడుపాటి నర్సింహారావు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఖమ్మం వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా పల్లిపాడు స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజ్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు నర్సింహారావు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు., మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.



