Saturday, 5 September 2026
  • Home  
  • గురువులకు ఘన గౌరవం.. కేజీబీవీ ఆనందపురంలో సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఘన సత్కారం
- విశాఖపట్నం

గురువులకు ఘన గౌరవం.. కేజీబీవీ ఆనందపురంలో సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఘన సత్కారం

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 :: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV), ఆనందపురంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి దొండా చంద్రకళ గారు తెలియజేశారు విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ప్రముఖ దాత శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది “గురువు చేతిలోనే.. విద్యార్థి భవిష్యత్తు” ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారు పంపిన ప్రత్యేకమైన సందేశాన్ని ప్రిన్సిపల్ గారు సబికులకు వినిపించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అంకితభావం, కృషి, సేవలు సమాజ అభివృద్ధికి పునాది వంటివని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలు, క్రమశిక్షణ, మంచి భవిష్యత్తును అందించడంలో గురువుల పాత్ర అమూల్యమని కొనియాడారు. ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతూ ప్రతి ఒక్కరినీ శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూలదండలు, జ్ఞాపికలు, బహుమతులతో ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ సత్కారం ఉపాధ్యాయుల్లో ఆనందాన్ని నింపింది. విద్యార్థుల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తమ గురువుల పట్ల గౌరవాభిమానాలను చాటుతూ ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువుల సేవలకు అభినందనలు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కోరుకొండ శివాజీ గారు.వైస్ చైర్మన్ ఓ.మంగ అప్పన్న గారు.పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుని నిస్వార్థంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గురువుల మార్గదర్శకత్వమే విద్యార్థుల విజయానికి బలమైన పునాది అని అన్నారు. ఆత్మీయ సత్కారంతో ఆనందించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చూపిన ప్రత్యేక అభిమానం, గౌరవానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. గురువుల సేవలను గుర్తించి ఇంత ఆత్మీయంగా సత్కరించడం పాఠశాల సిబ్బందిలో సంతోషాన్ని నింపింది. “గురువు ఒక దీపం.. తన వెలుగుతో ఎన్నో జీవితాలకు దారి చూపే మహనీయుడు” అనే సందేశంతో సాగిన ఈ వేడుకలు ఆనందపురం KGBVలో చిరస్మరణీయంగా నిలిచాయి.

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 ::
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV), ఆనందపురంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి దొండా చంద్రకళ గారు తెలియజేశారు విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ప్రముఖ దాత శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది

“గురువు చేతిలోనే.. విద్యార్థి భవిష్యత్తు”
ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారు పంపిన ప్రత్యేకమైన సందేశాన్ని ప్రిన్సిపల్ గారు సబికులకు వినిపించారు
ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అంకితభావం, కృషి, సేవలు సమాజ అభివృద్ధికి పునాది వంటివని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలు, క్రమశిక్షణ, మంచి భవిష్యత్తును అందించడంలో గురువుల పాత్ర అమూల్యమని కొనియాడారు.

ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతూ ప్రతి ఒక్కరినీ శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూలదండలు, జ్ఞాపికలు, బహుమతులతో ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ సత్కారం ఉపాధ్యాయుల్లో ఆనందాన్ని నింపింది.

విద్యార్థుల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తమ గురువుల పట్ల గౌరవాభిమానాలను చాటుతూ ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గురువుల సేవలకు అభినందనలు

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కోరుకొండ శివాజీ గారు.వైస్ చైర్మన్ ఓ.మంగ అప్పన్న గారు.పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు.

వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుని నిస్వార్థంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గురువుల మార్గదర్శకత్వమే విద్యార్థుల విజయానికి బలమైన పునాది అని అన్నారు.

ఆత్మీయ సత్కారంతో ఆనందించిన ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చూపిన ప్రత్యేక అభిమానం, గౌరవానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. గురువుల సేవలను గుర్తించి ఇంత ఆత్మీయంగా సత్కరించడం పాఠశాల సిబ్బందిలో సంతోషాన్ని నింపింది.

“గురువు ఒక దీపం.. తన వెలుగుతో ఎన్నో జీవితాలకు దారి చూపే మహనీయుడు” అనే సందేశంతో సాగిన ఈ వేడుకలు ఆనందపురం KGBVలో చిరస్మరణీయంగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.