శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని అమరజ్యోతి కల్యాణ మండపం వెనుక ఉన్న ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వివిధ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అమరావతి గిరిజన గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రవేశ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. పాఠశాలలో గిరిజన విద్యార్థులకు 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పలు సీట్లు అందుబాటులో ఉండగా, 3వ తరగతిలో ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు కూడా పరిమిత సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను లాటరీ విధానంలో, 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 92476 30031, 94932 53578 నంబర్లను సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.

గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం