Thursday, 30 July 2026
  • Home  
  • గురు పౌర్ణమి సందర్భంగా మల్లం శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు, భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలు.. భారీగా తరలివచ్చిన భక్తులు,
- తిరుపతి

గురు పౌర్ణమి సందర్భంగా మల్లం శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు, భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలు.. భారీగా తరలివచ్చిన భక్తులు,

పున్నమి న్యూస్ హరికృష్ణ జులై 29 చిట్టమూరు మండలం, గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిటమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు ముని శేఖర్ రెడ్డి,సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు దర్శనం ఏర్పాట్లు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి తెల్లవారుజామున నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలుతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలను ప్రత్యేక అలంకరించడంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కి పూలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో స్థానిక ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయం సంఘటనలను చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.. ఊరేగింపు సందర్భంగా భక్తులు భక్తి గీతాలు, ఆధ్యాత్మిక నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్వహకులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఊరేగింపు కార్యక్రమంల తో మల్లం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, భక్తులకు, గ్రామ ప్రజలకు ఆలయ ధర్మకర్త కృతజ్ఞతలు తెలిపారు.

పున్నమి న్యూస్ హరికృష్ణ జులై 29 చిట్టమూరు మండలం,

గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిటమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఆలయ ధర్మకర్తలు ముని శేఖర్ రెడ్డి,సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు దర్శనం ఏర్పాట్లు చేశారు.
గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి తెల్లవారుజామున నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలుతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ పరిసరాలను ప్రత్యేక అలంకరించడంతో పండగ వాతావరణం నెలకొంది.
అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కి పూలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఊరేగింపు కార్యక్రమంలో స్థానిక ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయం సంఘటనలను చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు..
ఊరేగింపు సందర్భంగా భక్తులు భక్తి గీతాలు, ఆధ్యాత్మిక నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ నిర్వహకులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఊరేగింపు కార్యక్రమంల తో మల్లం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, భక్తులకు, గ్రామ ప్రజలకు ఆలయ ధర్మకర్త కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.