శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) : తొట్టంబేడు మండలం పిల్లమేడు గిరిజన కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న వీధిలైట్ల సమస్యకు రాత్రికి రాత్రే పరిష్కారం లభించింది. కాలనీలో చీకట్లు అలుముకున్నాయనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవడంతో, జనసేన పార్టీ ‘పేట బ్రదర్స్’ మిత్రబృందం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్థానిక ఎంపీడీవో, పెద్ద కనపర్తి సచివాలయ సిబ్బంది తక్షణమే స్పందించారు. అత్యంత అభినందనీయమైన విషయమేమిటంటే, ఎంపీడీవో గారు ప్రస్తుతం విధి నిర్వహణలో భాగంగా శిక్షణ (ట్రైనింగ్) లో ఉండి కూడా, సమాచారం అందిన కొద్ది గంటల్లోనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆయన దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ చూపిన నిబద్ధత, బాధ్యతారాహిత్యానికి తావులేకుండా సిబ్బందిని సమన్వయం చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపినందుకు గిరిజన ప్రజలు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి, జనసేన నాయకులకు, ఎంపీడీవోకు, సచివాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా స్పందించినందుకు కూటమి ప్రభుత్వం తరఫున కూడా అధికారులకు కృతజ్ఞతలు వెల్లడించారు.

గిరిజన కాలనీలో రాత్రికి రాత్రే వెలుగులు-అధికారుల స్పందనకు జనసేన ప్రశంసలు