శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానిక మహిళలకు పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి కటాక్షం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే శ్రీకాళహస్తి చరిత్రలో తొలిసారిగా గంగమ్మ తల్లికి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించడం గర్వకారణమన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందారు.

గంగమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి-పవిత్ర రెడ్డి