ఖమ్మం నగరంలోని ఖమ్మం పబ్లిక్ స్కూల్లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ కిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సరితతో పాటు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు. విద్యార్థుల ఉత్సాహం, దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.



