ఉదయగిరి: మండలంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఉపాధి హామీ పథకం ఏపీవో ఉమా మహేశ్వరరావు సూచించారు. క్షేత్ర సహాయకులు తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులను గుర్తించి చేపట్టాలని సూచించారు. పనుల ఎంపిక, అమలు, కూలీలకు ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి దోహదపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

క్షేత్ర సహాయకులు బాధ్యతగా పని చేయాలి: ఏపీవో ఉమా మహేశ్వరరావు