పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 29:
* క్రాఫ్ట్ విలేజ్ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో క్రాఫ్ట్ విలేజ్ పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, డీఆర్‌డీఏ (DRDA) సమన్వయంతో మొత్తం 3 ఎంపోరియం బ్లాక్‌లు, 3 వర్క్ షెడ్లు మరియు మరుగుదొడ్డి సౌకర్యంతో కూడిన 1 శిక్షణ తరగతి గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను రోడ్లు మరియు భవనాల శాఖ (R&B Department) టెండర్ విధానంలో చేపట్టిందని తెలిపారు. మొత్తం 3 ఎంపోరియం బ్లాక్ లు, శిక్షణ తరగతి గది నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. 3 వర్క్ షెడ్లలో 1 వర్క్ షెడ్ నిర్మాణం పూర్తికాగా, మిగిలిన 2 వర్క్ షెడ్ల నిర్మాణ పనులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను సంబంధిత శాఖలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, డిఆర్డిఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు డిఆర్డిఏ పిడి లు శోభన్ బాబు, శ్రీదేవి, ఏడి హ్యాండి క్రాఫ్ట్ సత్యమూర్తి, ఆర్ అండ్ బి ఈఈ రాజా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
*—డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి—*



