నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు.పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.విద్యతోపాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని తెలిపారు.విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులను భవిష్యత్ పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జటప్రోలు పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు._

కొల్లాపూర్ జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు