ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో క్షయ వ్యాధిగ్రస్తుడి కుటుంబాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ నితీష్ రామ్ స్వయంగా పరామర్శించారు. రోగికి మందులు సకాలంలో అందుతున్నాయా, ఆర్థిక సహాయం చేరుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. రోగి కుటుంబం సంతృప్తికర సమాధానాలు ఇవ్వగా వైద్య బృందం అభినందించింది. సమయానికి మందులు తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షయ నివారణ అధికారి దేవ గణేష్, జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు.

కొమ్మలపూడిలో క్షయ రోగి కుటుంబాన్ని పరామర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో క్షయ వ్యాధిగ్రస్తుడి కుటుంబాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ నితీష్ రామ్ స్వయంగా పరామర్శించారు. రోగికి మందులు సకాలంలో అందుతున్నాయా, ఆర్థిక సహాయం చేరుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. రోగి కుటుంబం సంతృప్తికర సమాధానాలు ఇవ్వగా వైద్య బృందం అభినందించింది. సమయానికి మందులు తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షయ నివారణ అధికారి దేవ గణేష్, జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు.

