Monday, 22 June 2026
  • Home  
  • కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 21 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు వెంకటనగర్‌కు చెందిన య ల్లమల సాయి (28) నాయుడుపేట నుంచి నెల్లూరుకు బైక్‌పై వస్తుండగా, మనుబోలు మండలం కొమ్మలపూడి రోడ్డు సమీపంలో కాఫీ డే ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న జ్యోతి (25), చిన్నారి గాయపడగా, జ్యోతికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్‌ఐ శివ రాకేష్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంతో ఏర్పడిన ట్రాఫిక్‌ను పోలీసులు వేగంగా క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 21 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు వెంకటనగర్‌కు చెందిన య ల్లమల సాయి (28) నాయుడుపేట నుంచి నెల్లూరుకు బైక్‌పై వస్తుండగా, మనుబోలు మండలం కొమ్మలపూడి రోడ్డు సమీపంలో కాఫీ డే ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న జ్యోతి (25), చిన్నారి గాయపడగా, జ్యోతికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్‌ఐ శివ రాకేష్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంతో ఏర్పడిన ట్రాఫిక్‌ను పోలీసులు వేగంగా క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.