నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని కేజీబీవీ, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రవేశాలు, అప్లికేషన్లు, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం, అమలు వంటి అంశాలను పరిశీలించారు.
గత మూడు సంవత్సరాలుగా ప్రవేశాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్చరర్ల కొరతను తీర్చడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, అందువల్ల అడ్మిషన్ల పెంపుపై ప్రిన్సిపాల్స్ దృష్టి పెట్టాలని సూచించారు.
కొన్ని కళాశాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ వాటిని మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి బోధించాలన్నారు .
విద్యార్థుల హాజరు శాతం పెంపు, అభ్యసన సామర్థ్యల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యు డైస్ పూర్తి స్థాయిలో నమోదు చేసి,అన్ని ఇంటర్ కళాశాలలో ఫేస్ రికగ్నేషన్ సిస్టం 100% అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ వైద్యాధికారి దశ్రు నాయక్, డీఈవో బిక్షపతి ఆర్సిఓ స్వప్న, బలరాం తదితరులు మాట్లాడారు.
వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

కేజీబీవీలు, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాల మెరుగుదలపై దృష్టి పెట్టిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని కేజీబీవీ, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రవేశాలు, అప్లికేషన్లు, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం, అమలు వంటి అంశాలను పరిశీలించారు. గత మూడు సంవత్సరాలుగా ప్రవేశాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్చరర్ల కొరతను తీర్చడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, అందువల్ల అడ్మిషన్ల పెంపుపై ప్రిన్సిపాల్స్ దృష్టి పెట్టాలని సూచించారు. కొన్ని కళాశాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ వాటిని మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి బోధించాలన్నారు . విద్యార్థుల హాజరు శాతం పెంపు, అభ్యసన సామర్థ్యల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యు డైస్ పూర్తి స్థాయిలో నమోదు చేసి,అన్ని ఇంటర్ కళాశాలలో ఫేస్ రికగ్నేషన్ సిస్టం 100% అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ వైద్యాధికారి దశ్రు నాయక్, డీఈవో బిక్షపతి ఆర్సిఓ స్వప్న, బలరాం తదితరులు మాట్లాడారు. వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

