Monday, 14 September 2026
  • Home  
  • కుబీర్‌లో కొలువుదీరిన కర్ర గణపతి 15 ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటున్న శ్రీ వరసిద్ధి వినాయకుడు
- నిర్మల్

కుబీర్‌లో కొలువుదీరిన కర్ర గణపతి 15 ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటున్న శ్రీ వరసిద్ధి వినాయకుడు

కుబీర్, సెప్టెంబరు 13 (పున్నమి ప్రతినిధి): కుబీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర మందిరం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక (కర్ర గణపతి) ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా కొలువుదీరి పూజలందుకుంటున్న కర్ర గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు కొబ్బరికాయలు, పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పరిసర గ్రామాల నుంచి సైతం భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనానికి భక్తజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.