ఆర్యవైశ్య ప్రముఖులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టి.జి వెంకటేష్ జన్మదిన వేడుకలు కావలి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నేత తటవర్తిరమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెంకటేష్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనను నెలకు ఒకసారి అయినా చూడకుండా ఉండలేనని ప్రతి సభలో చెప్పుకునే రమేష్ ఆయన జన్మదిన వేడుక సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింపచేసి దాదాపు 700 మందికి పైగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కర్నూల్ లో ఆయనకు వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు అందించిన ఆయన ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం కలకాలం ఇవ్వాలని కోరారు. రమేష్ శ్రీమతి శిరీష కుమారుడు రాహుల్ ఆర్యవైశ్య పట్టణ నేత సునీల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ తో లాంటి వ్యక్తి తమ జాతి లో ఉండడం తమకు ఎంతో గర్వకారణం అని, అలాంటి మానవతావాది తమకు మార్గదర్శకంగా ఉండడం తాము చేసుకున్న అదృష్టం గా పేర్కొన్నారు. వెంకటేష్ బాటలో ఆర్యవైశ్యులకు జీవితాంతం సేవలు అందిస్తామని రమేష్ పేర్కొనగా, తమ కుటుంబం అంతా అదే బాటలో కొనసాగుతుందని శిరీష పేర్కొన్నారు..



