Tuesday, 29 September 2026
  • Home  
  • కాకినాడ సామర్లకోట కెనాల్స్ ప్రక్షాళన చేయాలి.. *కాగడా జ్యోతితో పాదయాత్ర నిరసన చేసిన సామాజిక వేత్త రమణరాజు*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకినాడ సామర్లకోట కెనాల్స్ ప్రక్షాళన చేయాలి.. *కాగడా జ్యోతితో పాదయాత్ర నిరసన చేసిన సామాజిక వేత్త రమణరాజు*

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్):ఉమ్మడి రాష్ట్ర విభజన నుండి గత 12 సంవత్సరాలుగా కాకినాడ సామర్లకోట రోడ్డు కిరువైపులా వున్న కెనాల్స్ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఇప్పుడు సిటీ రూరల్ ప్రాంతాలు జల దిగ్భంధనం లో వుండటం పాలకుల బాధ్యత రాహిత్య మని ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు నిరసన వ్యక్తం చేశారు.కెనాల్ రహదారిలో కాగడ చేపట్టి నిరసన పాదయాత్ర చేశారు.అక్రమ వంతెనలు తొలగింపు చేసి పిపిపి పద్ధతిలో ప్రభుత్వ వంతెనలు నిర్మాణం చేయాలని కోరారు. కెనాల్ వెడల్పు 30 నుండి 12 అడుగులకు తగ్గి పోగా లోతు30 నుండి 4 అడుగులకు తగ్గిపోయిందన్నారు.కెనాల్స్ ప్రక్షాళన లేకపోవడం వలన వరద నీరు వర్షం నీరు మురుగు నీరు ప్రజల నివాసాల్లోకి చేరిందన్నారు.ఇంద్రపాలెం లాకుల వద్ద అడ్డగోలుగా నిర్మించిన మేడ లైన్ ప్రయివేట్ వంతెన ప్రారంభం అక్టోబర్ 12 న ముఖ్యమంత్రి ప్రారంభం చేస్తున్నారన్న వార్తలు వస్తున్న దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేడ లైన్ మెగా వంతెన అక్రమమా!! సక్రమమా!! ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2027 జనవరి 26 నాటికి కాకినాడ సామర్లకోట రోడ్డు కిరువైపులా వున్న కెనాల్స్ ప్రక్షాళన చేయాలని లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష తప్పదని ప్రకటించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్):ఉమ్మడి రాష్ట్ర విభజన నుండి
గత 12 సంవత్సరాలుగా కాకినాడ సామర్లకోట రోడ్డు కిరువైపులా వున్న కెనాల్స్ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఇప్పుడు సిటీ రూరల్ ప్రాంతాలు జల దిగ్భంధనం లో వుండటం పాలకుల బాధ్యత రాహిత్య మని ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు నిరసన వ్యక్తం చేశారు.కెనాల్ రహదారిలో కాగడ చేపట్టి నిరసన పాదయాత్ర చేశారు.అక్రమ వంతెనలు తొలగింపు చేసి పిపిపి పద్ధతిలో ప్రభుత్వ వంతెనలు నిర్మాణం చేయాలని కోరారు. కెనాల్ వెడల్పు 30 నుండి 12 అడుగులకు తగ్గి పోగా లోతు30 నుండి 4 అడుగులకు తగ్గిపోయిందన్నారు.కెనాల్స్ ప్రక్షాళన లేకపోవడం వలన వరద నీరు వర్షం నీరు మురుగు నీరు ప్రజల నివాసాల్లోకి చేరిందన్నారు.ఇంద్రపాలెం లాకుల వద్ద అడ్డగోలుగా నిర్మించిన మేడ లైన్ ప్రయివేట్ వంతెన ప్రారంభం అక్టోబర్ 12 న ముఖ్యమంత్రి ప్రారంభం చేస్తున్నారన్న వార్తలు వస్తున్న దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేడ లైన్ మెగా వంతెన అక్రమమా!! సక్రమమా!! ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2027 జనవరి 26 నాటికి కాకినాడ సామర్లకోట రోడ్డు కిరువైపులా వున్న కెనాల్స్ ప్రక్షాళన చేయాలని లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష తప్పదని ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.