తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కిరణ్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆశీస్సులతో తనకు ఈ బాధ్యత లభించిందని కిరణ్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందనడానికి తన నియామకం ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
తాను గతంలో డ్రైవర్ స్థాయి నుంచి మండల సోషల్ మీడియా కార్యకర్తగా, అనంతరం జిల్లా సోషల్ మీడియా బాధ్యతల్లో పనిచేసి, ఇప్పుడు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నియమితులయ్యానని కిరణ్ గౌడ్ తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన నూతన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు, పార్టీ నాయకుల ఆలోచనలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తానని కిరణ్ గౌడ్ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ గౌడ్‌కు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు లభించడంపై మంథని ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

