కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు.
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మనీషా లక్ష్మి.
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే
07గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు.
మండల పరిధిలోని కాలనీ నాచారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైరా బిఆర్ఎస్ నాయకురాలు మనిషా లక్ష్మి మదన్ లాల్ బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసు పల్లి గ్రామానికి చెందిన గూగుల్ మోతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె దశదిన కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శ్రీరామ్ పురం తండా గ్రామంలో ఆంగో శ్రీను ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. ఎర్రబడు తండా గ్రామంలో ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో రాబోయేది బిఆర్ఎస్ పార్టీ అని నాయకులు, కార్యకర్తలు అధైర్య పడద్దని ఆమె తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చిన నేనుంటా అంటూ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు జరా సాంబయ్య, బానోతు వెంకన్న, నాయకులు మల్లెంపాటికి మాధవరావు, మల్లెంపాటి హరిబాబు, అజ్మీరా రైలు, చీటీ ముత్యం, గణేశుల బాబు, పుల్లయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.



