గురువారం సందర్భంగా శాస్త్రోక్తంగా హోమం, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు రాజశేఖర్ శర్మ)
కల్లూరు, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
కల్లూరు ఘాట్ పరిధిలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు గురుదక్షిణామూర్తి ఆలయంలో గురువారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. గురువార పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమ మహోత్సవాన్ని నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివార్లకు పుష్పాలంకరణ చేసి మహామంగళహారతి ఇచ్చారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

