Tuesday, 15 September 2026
  • Home  
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ చరిత్ర మరుగున పడేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
- మంచిర్యాల

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ చరిత్ర మరుగున పడేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారంకంగా నిర్వహించకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ బారాస ప్రభుత్వాలు వంచనకు గురి చేశాయని బిజెపి నాయకులు అన్నారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తాండూర్ మండల డిప్యూటీ తహశిల్దార్ కి వినపత్రం అందజేశారు.తెలంగాణతో పాటు స్వాతంత్రం వచ్చిన ప్రాంతాలలో కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని తెలంగాణలో రాజకీయ పార్టీలు మైనార్టీసంతోష్ణీకరణ విధానం అనుబలంబిస్తూ ఈ వేడుకలను నిర్వహించడంలో అలసత్వం వహిస్తున్నాయని అన్నారు.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం గోల్కొండ ఖిలాపై ఉత్సవాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దినోత్సవం పేరుతో అసలైన స్వతంత్ర దినోత్సవ వేడుకలను మరుగున పడేయడానికి ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అభీష్టo మేరకు కేంద్ర ప్రభుత్వం 2023 నుండి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగ నిర్వహిస్తుందని ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13 1948న సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రారంభించిన ఆపరేషన్ పోలో విజయవంతమై సెప్టెంబర్ 17 1948న స్వాతంత్రం వచ్చిన విషయాన్ని 13 నెలల పాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన బానిస జీవితాన్ని తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,జిల్లా కార్యదర్శి రామగౌని మహిధర్ గౌడ్,జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల కార్యదర్శి గాదే రాజేశం,సీనియర్ నాయకులు కోమండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.