Saturday, 30 May 2026
  • Home  
  • ఐకేపీ, వీవోఏ సిబ్బంది ధర్నాకు మాజీ ఎమ్మెల్యే సండ్ర మద్దతు..
- ఖమ్మం

ఐకేపీ, వీవోఏ సిబ్బంది ధర్నాకు మాజీ ఎమ్మెల్యే సండ్ర మద్దతు..

పెనుబల్లి, మే (ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి) : ఐకేపీ, వీవోఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఉద్యోగి కూడా ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీవోఏ సిబ్బందికి నెలకు రూ.20 వేల కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. జీఓ నెం.58ను సవరించడంతో పాటు అర్హులైన వీవోఏలను కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా (సీసీలు) పదోన్నతి కల్పించాలని అన్నారు. ప్రతి ఉద్యోగికి ట్యాబ్ సౌకర్యం అందించాలని, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనాన్ని హక్కుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు మందాడపు అశోక్‌కుమార్, కోట ప్రభాకర్, టీవీ రామారావు, ఎస్‌కే గౌస్, పసుమర్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ చలపతిరావు, చక్కిలాల లక్ష్మణ్‌రావు, కోమటి ప్రసాద్, తవునాయక్, కొప్పుల గోవిందరావు, ఎటుకూరి సత్యంబాబు, వంగ చిన్నపండు, వేముల బాబురావు, వేముల సురేష్, వంకోడత్ మురళి, రాజబాబు, మరకాల చంటి, మరకాల వెంకీ, వర్ధబోయిన నాగేశ్వరరావు, మల్లాది రవి, గుణగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెనుబల్లి, మే

(ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి)

:
ఐకేపీ, వీవోఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఉద్యోగి కూడా ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీవోఏ సిబ్బందికి నెలకు రూ.20 వేల కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. జీఓ నెం.58ను సవరించడంతో పాటు అర్హులైన వీవోఏలను కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా (సీసీలు) పదోన్నతి కల్పించాలని అన్నారు. ప్రతి ఉద్యోగికి ట్యాబ్ సౌకర్యం అందించాలని, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనాన్ని హక్కుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు మందాడపు అశోక్‌కుమార్, కోట ప్రభాకర్, టీవీ రామారావు, ఎస్‌కే గౌస్, పసుమర్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ చలపతిరావు, చక్కిలాల లక్ష్మణ్‌రావు, కోమటి ప్రసాద్, తవునాయక్, కొప్పుల గోవిందరావు, ఎటుకూరి సత్యంబాబు, వంగ చిన్నపండు, వేముల బాబురావు, వేముల సురేష్, వంకోడత్ మురళి, రాజబాబు, మరకాల చంటి, మరకాల వెంకీ, వర్ధబోయిన నాగేశ్వరరావు, మల్లాది రవి, గుణగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.