ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలు, సూచనల మేరకు నగిరిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సమస్యలపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు.ఈ నెల 5వ తేదీ ఉదయం 10.30 గంటలకు నగిరిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని స్వచ్ఛ గ్రామం–నగిరిపాడు గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యలు, వారి హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.గ్రామంలోని సంబంధిత వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరులు ఈ ప్రత్యేక గ్రామసభకు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని గ్రామ పంచాయతీ అధికారులు కోరారు.– పంచాయతీ అభివృద్ధి అధికారి, నగిరిపాడు గ్రామ పంచాయతీ, చిట్వేల్ మండలం
ఎస్సీ, ఎస్టీ, బీసీ సమస్యలపై ప్రత్యేక గ్రామసభ