Sunday, 2 August 2026
  • Home  
  • ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ-లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి
- తిరుపతి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ-లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 01, (పున్నమి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు, పీలేరు నియోజకవర్గ పరిశీలకులు మాసారపు సుబ్బయ్య స్పష్టం చేశారు. ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ’ లో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో మొదటిదైన ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం’ నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోందని కొనియాడారు. ఆగస్టు ఒకటో తేదీ శనివారం ఉదయం 7 గంటలకే శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని బహదూర్‌పేట రాతిపనివారి వీధిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లిన మాసారపు సుబ్బయ్య, వృద్ధులు, వికలాంగులు, అవ్వాతాతలకు అత్యంత గౌరవప్రదంగా పింఛన్ నగదును అందజేశారు. ప్రతి నెల ఒకటో తేదీన తెల్లవారుజామునే లబ్ధిదారుల చేతుల్లో పింఛన్ సొమ్ము పెట్టడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.