Saturday, 2 May 2026
  • Home  
  • ఊరందూరులో చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం వైభవం… భక్తులతో కళకళలాడిన బ్రహ్మోత్సవాలు
- తిరుపతి

ఊరందూరులో చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం వైభవం… భక్తులతో కళకళలాడిన బ్రహ్మోత్సవాలు

శ్రీకాళహస్తి, మే 02 (పున్నమి న్యూస్): భక్తుల కొంగుబంగారంగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఊరందూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. లోకక్షేమం కోసం నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం తరఫున అధికారులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివార్లకు సమర్పించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరిహరుల ఐక్యతకు ప్రతీకగా సాగిన ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చక స్వాముల వేదమంత్రోచ్ఛారణలు, గోవింద నామస్మరణల మధ్య శ్రీ చెన్నకేశవ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణ వేదికపై కొలువుదీరగా, శాస్త్రోక్తంగా వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయగా, ఉత్సవ ప్రాంగణం భక్తి పరవశంతో మార్మోగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.