Sunday, 16 August 2026
  • Home  
  • *ఉపాధి కూలీలతో ఘనంగ సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్న అధికారులు, నాయకులు,*
- తిరుపతి

*ఉపాధి కూలీలతో ఘనంగ సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్న అధికారులు, నాయకులు,*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,* (కోగిలి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కోగిలి పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రషీద్ భాయ్, ఏపీవో షీలా, టెక్నికల్ అసిస్టెంట్ శరత్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను వివరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో అనేకమంది తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని తెలిపారు. దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. జాతీయ సమైక్యత, సోదరభావం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై కూడా కూలీలకు అవగాహన కల్పించారు. “పచ్చని చెట్లు నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి” అంటూ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్లు పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉపాధి కూలీల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని మరింత పెంపొందించింది. కార్యక్రమంలో ఉపాధి కూలీలు, సిబ్బంది, స్థానిక నాయకులు టిడిపి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ భాయ్, టిడిపి సీనియర్ మాజీ ఎంపీటీసీ ముజ్మీర్, టిడిపి సీనియర్ నాయకులు కమతం వెంకటేశ్వర్లు వేమ గుంట పాలెం,టిడిపి యువ నాయకులు ఖలీల్ భాషా, ఏపీవో షీలా, టెక్నికల్ అసిస్టెంట్ శరత్, వీరాస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ కమతం చెంగయ్య,బల్లి ఉదయ్, మరియు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,*

(కోగిలి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కోగిలి పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రషీద్ భాయ్, ఏపీవో షీలా, టెక్నికల్ అసిస్టెంట్ శరత్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను వివరించారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో అనేకమంది తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని తెలిపారు.
దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు.
జాతీయ సమైక్యత, సోదరభావం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే పర్యావరణ పరిరక్షణపై కూడా కూలీలకు అవగాహన కల్పించారు. “పచ్చని చెట్లు నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి” అంటూ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
చెట్లు పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని వివరించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉపాధి కూలీల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని మరింత పెంపొందించింది.
కార్యక్రమంలో ఉపాధి కూలీలు, సిబ్బంది, స్థానిక నాయకులు టిడిపి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ భాయ్, టిడిపి సీనియర్ మాజీ ఎంపీటీసీ ముజ్మీర్, టిడిపి సీనియర్ నాయకులు కమతం వెంకటేశ్వర్లు వేమ గుంట పాలెం,టిడిపి యువ నాయకులు ఖలీల్ భాషా, ఏపీవో షీలా, టెక్నికల్ అసిస్టెంట్ శరత్, వీరాస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ కమతం చెంగయ్య,బల్లి ఉదయ్, మరియు
ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.