ఉదయగిరి: 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని వినతి
ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే అమలు చేయాలని ఆవాజ్ ఉదయగిరి మండల కమిటీ కోరింది. ప్రస్తుతం పింఛన్ల ప్రక్రియ జరుగుతున్నందున 50 ఏళ్లు నిండిన మైనారిటీలకు కూడా ఇవ్వాలని MPDOను కోరారు. చిన్న వయసు నుంచే కూలి, చేతివృత్తులపై ఆధారపడుతున్న మైనారిటీలకు 50 ఏళ్లకే ఆర్థిక భరోసా అవసరమని కమిటీ పేర్కొంది. ఇచ్చిన హామీని అమలు చేసి పింఛన్ అందించాలని కోరారు.


