దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతమే ఉండే అవకాశముందని తెలిపింది. గతంలో అంచనా వేసిన 92 శాతం నుంచి ఈ అంచనాను తగ్గించింది.
కేరళలో రుతుపవనాల ప్రవేశం కూడా ఆలస్యమయ్యే అవకాశముందని, జూన్ తొలి వారంలోనే అవి చేరే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఎల్నినో ప్రభావం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటలు, భూగర్భ జలాలు, తాగునీటి వనరులపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


