Saturday, 16 May 2026
  • Home  
  • ఇసుకపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు : జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ
- తూర్పు గోదావరి

ఇసుకపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు : జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి )మే 16 : తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుట లేదని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో పర్యావరణ అనుమతులు పొందిన ఓపెన్ సాండ్ రీచ్ లు, డీ సిల్టేషన్ రీచ్ లు మరియు పట్టా భూములలో మాత్రమే ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయని ఏపీ మైనింగ్ ఏడి ఫణిభూషణ్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 64 ఇసుక రీచ్ లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో డీ-సిల్టేషన్ రీచ్ లు, పట్టా భూములలోని ఇసుక రీచ్ లు మరియు సెమీ- మెకనైజ్డ్ రీచ్ లు ఉన్నాయన్నారు. పైన పేర్కొన్న ఇసుక రీచ్ లలో 13.05.2026 నాటికి సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. అదనంగా సుమారు 57 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాల కోసం అవసరమైన పర్యావరణ అనుమతులు పొందిన అనంతరం వర్క్ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక ఇసుక విక్రయ ధరలను రీచ్ లను బట్టి నిర్ణయించారు. సెమీ మెకనైజ్డ్ రీచ్ లలో టన్ను ఇసుక ధర రూ.95/ పట్టా భూములలో రూ.158/- మరియు డీ-సిల్టేషన్ రీచ్ లలో రూ. 229/- గా నిర్ణయించడం జరిగిందన్నారు. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1 వ తేదీ నుండి అక్టోబర్ 15 వ తేదీ వరకు వర్షాకాలం కారణంగా ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిలిపివేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత తలెత్తకుండా ముందస్తుగా తగిన చర్యలు చేపట్టినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. మాన్సూన్ కాలంలో ఇసుక అవసరాలను తీర్చుటకు జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రత్యేక మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, సీతానగరం మరియు తాళ్ళపూడి మండలాల పరిధిలో మొత్తం 39 స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రస్తుతం సుమారు 10.70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయబడినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, రవాణా, రెవెన్యూ మరియు గనుల శాఖల సమన్వయంతో రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్లలో జిల్లా మరియు డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. ఈ బృందాలు అక్రమ ఇసుక రవాణా, అధిక ధరలకు విక్రయాలు మరియు ఉచిత ఇసుక పంపిణీలో జరిగే దుర్వినియోగాలను అరికట్టేందుకు ఈ బృందం నిరంతర పర్యవేక్షణ చేపడుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి ఇసుక కొరత లేదని, అయినప్పటికీ కొన్ని పత్రికలలో ప్రతికూల వార్తలు ప్రచురించబడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా ఇసుకను అధిక ధరలకు విక్రయించినట్లు తగిన ఆధారాలతో జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిన యెడల సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇసుక కు సంబందించి ఫిర్యాదులు కొరకు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమండ్రి కార్యాలయ టొల్ ఫ్రీ నెం 1800-425-6023. సంప్రదించవచ్చు అన్నారు.

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి )మే 16 : తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుట లేదని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో పర్యావరణ అనుమతులు పొందిన ఓపెన్
సాండ్ రీచ్ లు, డీ సిల్టేషన్ రీచ్ లు మరియు పట్టా భూములలో మాత్రమే ఇసుక తవ్వకాల
కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయని ఏపీ మైనింగ్ ఏడి ఫణిభూషణ్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 64 ఇసుక రీచ్ లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో డీ-సిల్టేషన్ రీచ్ లు, పట్టా భూములలోని ఇసుక రీచ్ లు మరియు సెమీ- మెకనైజ్డ్ రీచ్ లు ఉన్నాయన్నారు. పైన పేర్కొన్న
ఇసుక రీచ్ లలో 13.05.2026 నాటికి సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. అదనంగా సుమారు 57 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాల కోసం అవసరమైన పర్యావరణ అనుమతులు పొందిన అనంతరం వర్క్ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక ఇసుక విక్రయ ధరలను రీచ్ లను బట్టి నిర్ణయించారు. సెమీ మెకనైజ్డ్ రీచ్ లలో టన్ను ఇసుక ధర రూ.95/ పట్టా భూములలో రూ.158/- మరియు డీ-సిల్టేషన్ రీచ్ లలో రూ. 229/- గా నిర్ణయించడం జరిగిందన్నారు.
పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1 వ తేదీ నుండి అక్టోబర్ 15 వ తేదీ వరకు వర్షాకాలం కారణంగా ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిలిపివేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత తలెత్తకుండా ముందస్తుగా తగిన చర్యలు చేపట్టినట్లు జిల్లా యంత్రాంగం
తెలిపింది. మాన్సూన్ కాలంలో ఇసుక అవసరాలను తీర్చుటకు జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రత్యేక మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, సీతానగరం మరియు తాళ్ళపూడి
మండలాల పరిధిలో మొత్తం 39 స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రస్తుతం సుమారు 10.70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయబడినట్లు అధికారులు
వెల్లడించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, రవాణా, రెవెన్యూ మరియు గనుల శాఖల సమన్వయంతో రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్లలో జిల్లా మరియు డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. ఈ బృందాలు అక్రమ ఇసుక రవాణా, అధిక ధరలకు విక్రయాలు మరియు ఉచిత ఇసుక పంపిణీలో జరిగే దుర్వినియోగాలను అరికట్టేందుకు ఈ బృందం
నిరంతర పర్యవేక్షణ చేపడుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి ఇసుక కొరత లేదని, అయినప్పటికీ కొన్ని పత్రికలలో ప్రతికూల వార్తలు ప్రచురించబడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా ఇసుకను అధిక ధరలకు
విక్రయించినట్లు తగిన ఆధారాలతో జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిన యెడల సంబంధిత వారిపై కఠిన
చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇసుక కు సంబందించి ఫిర్యాదులు కొరకు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమండ్రి
కార్యాలయ టొల్ ఫ్రీ నెం 1800-425-6023. సంప్రదించవచ్చు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.